HomeTelugu Trending"బాలీవుడ్ లో అసలైన సమస్య ఇదే!” WAVES Summit 2025 లో ఆమిర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు!

“బాలీవుడ్ లో అసలైన సమస్య ఇదే!” WAVES Summit 2025 లో ఆమిర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు!

Aamir Khan shocking statements about theatres shortage at WAVES Summit 2025
Aamir Khan shocking statements about theatres shortage at WAVES Summit 2025

Aamir Khan at WAVES Summit 2025:

WAVES Summit 2025లో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ హిందీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎందుకు బలహీనంగా కనిపిస్తున్నాయో ఓ ముఖ్యమైన కారణాన్ని బయటపెట్టాడు. “మన దేశంలో థియేటర్ల కొరతే అసలు సమస్య,” అని ఆమిర్ స్పష్టం చేశాడు.

ఆమిర్ చెప్పినదాని ప్రకారం, భారతదేశంలో సుమారు 10,000 స్క్రీన్లు మాత్రమే ఉన్నాయి. అయితే అమెరికాలో జనాభా మన కంటే తక్కువగా ఉండినా వాళ్ల దగ్గర 40,000 స్క్రీన్లు ఉన్నాయి. చైనాలో అయితే అట్టడుగు ప్రాంతాల్లో కూడా థియేటర్లు ఉండేలా 90,000 స్క్రీన్లు ఉన్నాయి. మన దేశంలో ఉన్న స్క్రీన్లలో సగం దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి అని ఆమిర్ తెలిపారు.

“భారతదేశం సినిమాలకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే దేశం. అయినా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాలు చూసినవాళ్ల సంఖ్య కేవలం 3 కోట్లమందే. అంటే దేశ జనాభాలో కేవలం 2 శాతం మాత్రమే సినిమాలను థియేటర్లలో చూస్తున్నారు,” అని ఆమిర్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇంకా మాట్లాడుతూ, “మన దేశంలో చాలా జిల్లాల్లో ఒక్క థియేటర్ కూడా లేదు. అక్కడి ప్రజలు సినిమాలను ఎలా చూస్తారు?” అని ప్రశ్నించారు. థియేటర్లు లేనందున చాలా మంది ఓటీటీలకు లేదా మొబైల్స్‌కు పరిమితమవుతున్నారు.

ఇండస్ట్రీలోని పెద్ద పేర్లు – నమిత్ మల్హోత్రా, దినేష్ విజన్, అజయ్ బిజ్లీ, రితేష్ సిద్వానీ, చార్లెస్ రోవెన్ – ఈ డిస్కషన్‌లో పాల్గొన్నారు. అందరి మధ్యలో ఆమిర్ స్పష్టంగా చెప్పిన విషయం – “థియేటర్‌లు పెంచకపోతే, మన సినిమాలు ప్రపంచ స్థాయికి వెళ్ళలేవు.”

ALSO READ: Shahrukh Khan Allu Arjun కాంబోలో సినిమా గురించి Vijay Deverakonda ఏమన్నారంటే

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!