జీవితంలో మూడు ‘E’లను ఫాలో అవుతా.. ‘ఏబీసీడీ’ ట్రైలర్‌

యువ నటుడు అల్లు శిరీష్‌ నటించిన సినిమా ‘ఏబీసీడీ’. ‘అమెరికన్‌ బార్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ’ అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రంలో రుక్సార్‌ ధిల్లన్‌ హీరోయిన్‌గా నటించారు. సంజీవ్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. కాగా.. ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ‘హాయ్‌ నా పేరు అవి. నేను జీవితంలో మూడు ‘E’లను ఫాలో అవుతుంటాను. ఎంజాయ్‌మెంట్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎగ్జైట్‌మెంట్‌’ అంటూ శిరీష్‌ చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. అమెరికాలో గొప్పింటి కుటుంబంలో పుట్టిన ఓ వ్యక్తి భారత్‌కు వచ్చి మధ్య తరగతి జీవితం గడపలేక ఎలా సతమతమయ్యాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న పరిస్థితులేంటి?అన్నదే కథ. ‘డ్యాడ్‌.. నువ్వు ‘స్వయంకృషి’లో చిరంజీవిలా ఫీలవ్వకు. కష్టాల్లోకి తోసేస్తే మారిపోతానని అనుకోకు. నేను రిచ్‌గానే పుట్టాను, రిచ్‌గానే పెరిగాను, రిచ్‌గానే ఉంటాను’ అంటూ చివర్లో శిరీష్‌ చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. మాస్టర్‌ భరత్‌. నాగబాబు, కోటా శ్రీనివాసరావు, శుభలేఖ సుధాకర్‌, రాజా తదితరులు సహాయ పాత్రలు పోషించారు. కొన్ని కారణాల వల్ల పలు మార్లు వాయిదా పడిన ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.