HomeTelugu Trendingరౌడీని కలిసిన అభిజిత్‌

రౌడీని కలిసిన అభిజిత్‌

Abhijit meets Vijay Devarakతెలుగు బిగ్‌బాస్‌- 4 విన్నర్‌ అభిజిత్‌కు షో నుంచి బయటకు వచ్చాక తనకు వస్తున్న మద్దతు చూసి అభి ఆశ్చర్యపోయాడు. హౌస్‌లో అతడు వ్యవహరించిన తీరుకు ఫ్యాన్స్‌ మాత్రమే కాదు సెలబబ్రిటీలు కూడా మంత్రముగ్దులవడం విశేషం. ఇక షో ముగిశాక అభిజిత్‌ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా మారాడు. ఈ నేపథ్యంలో తనకు సపోర్ట్‌ చేసిన సెలబ్రిటీలను సైతం కలుస్తున్నాడు అభిజిత్‌.

మొన్న నాగబాబును కలిసిన అభి నిన్న హీరో విజయ్‌ దేవరకొండను కలుసుకున్నాడు. ఈ మేరకు అతడితో కలిసి దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ‘ఫుల్‌ చిల్’‌ అని రాసుకొచ్చాడు. కాగా రౌడీ హీరో విజయ్‌.. అభి హౌస్‌లో ఉన్నప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అతడికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఇక అభి హీరోగా నటించిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్’‌ సినిమాలో విజయ్‌ దేవరకొండ ఒక చిన్న పాత్రలో నటించారు. ఆ సినిమాతో ఇద్దరూ క్లోజ్‌ అయ్యారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu