చిరు ‘సుందరి..’ అదిరింది!

చిరంజీవి 150 వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలయిన ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ అనే పాట ఈ అంచనాలను ఓ మేరకు అందుకుంది. అయితే రొటీన్ బీట్స్ అనే కామెంట్స్ మాత్రం వినిపించాయి. నిన్న ‘సన్నజాజిలా పుట్టేసిందిరో..’ అనే రెండో పాటను విడుదల చేశారు. దేవిశ్రీ సంగీతం, శ్రీమని సాహిత్యంతో కూడిన ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. అమ్మడు సాంగ్ కంటే ఈ పాట అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది.

ఈ పాటలో చిరు చాలా అందంగా, యంగ్ గా కన్పిస్తున్నాడు. స్టైలింగ్ విషయంలో ఆయన తీసుకున్న కేర్ ఫోటోస్ లో స్పష్టంగా కనిపిస్తోంది . అసలే డాన్స్ మూమెంట్స్ లో చిరుకి ఎవరు సాటిరారు. అటువంటిది మంచి బీట్ ఉన్న సాంగ్ పడితే ఇంక అభిమానులకు పండగే. ఇప్పటినుండే చిరు స్టెప్పులు ఎలా ఉంటాయా..? అని ఊహించేసుకుంటున్నారు. జనవరి 4న విజయవాడలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ ను అభిమానులు, సినీప్రముఖుల మధ్య గ్రాండ్ గా నిర్వహించనున్నారు.