
నటుడు రావు రమేష్ టాలీవుడ్‌లో రావు గోపాల్ రావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రావు రమేష్ తాజాగా తన గొప్ప మనస్సుని చాటుకున్నాడు. రావు రమేష్ తన వద్ద పనిచేసే మేకప్ మ్యాన్ మృతి చెందడంతో ఆయన కుంటుంబానికి రూ.10 లక్షలు ఆర్ధిక సహాయం అందించారు. స్వయంగా వారి ఇంటికి వెళ్లి ఆ కుంటుంబాన్ని పరామర్శించి, మేకప్ మ్యాన్ భార్యకు చెక్‌ను అందించారు. ఆ కుంటుంబానికి అండగా ఉంటాను అని ఆయన భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు రావు రమేష్‌ని ప్రశంసిస్తున్నారు.













