HomeTelugu Big Storiesబిగ్‌బాస్ కంటెస్టెంట్ పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు

బిగ్‌బాస్ కంటెస్టెంట్ పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు

10

బిగ్‌బాస్ రియాలిటీ షో ఎంత పాపులరో తెలిసిందే. ఈ షోకి ఎంత క్రేజ్‌ ఉందంటే హిందీలో ఇప్పటికే 12 సీజన్‌లు విజయవంతంగా పూర్తై 13వ సీజన్‌ నడుస్తోంది. ఇక తెలుగు, తమిళంల్లో 3 సీజన్లు పూర్తి అయ్యాయి. తెలుగులో నాగార్జున హోస్ట్‌గా వ్యహారించిన బిగ్‌బాస్‌ సీజన్‌ -3లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విన్నర్‌గా నిలిచాడు. కాగా యాంకర్‌ శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది. ఈ బిగ్‌బాస్ షో తమిళంలో కూడా సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది. అక్కడ ఈ షోకి 3 సీజన్లలో కమల్ హాసన్ హోస్ట్‌‌గా వ్యవహారించారు. అది అలా ఉంటే తమిళ బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ తర్షన్‌పై నటి, మోడల్ సనమ్ శెట్టి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తున్నాడంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. వివరాలలోకి వెళితే 2019లో తమిళ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్న తర్షన్ మే 2019లో తనతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడని తెలిపింది. అయితే బిగ్‌బాస్ షోలో పాల్గొనే అవకాశం రావడంతో జూన్‌లో జరగాల్సిన పెళ్లిని వాయిదా వేసుకున్నాము అని తెలిపింది.

10a

 

కాగా ఎప్పుడైతే తర్షన్ బిగ్‌బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాడో అప్పటినుండి తనతో వింతగా ప్రవర్తిస్తున్నాడని, అంతేకాకుండా పలురకాలుగా వేధిస్తూ తనను హింసించాడని ఆరోపించింది. తనకోసం దాదాపు 20 లక్షలు కూడా ఖర్చు చేశానని.. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు పలు రకాల కారణాతో పెళ్ళి వాయిదావేస్తూ వస్తున్నాడని పేర్కోంది. దీంతో విసిగిపోయి ఇటీవల పోలీసులను ఆశ్రయించాను అని తెలిపింది. అయితే ఈ విషయంపై తర్షన్‌ను స్పందిస్తూ.. అలాంటిదేమి లేదని సనమ్ అబద్దాలు చెబుతోందని తెలిపాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!