HomeTelugu Trendingబాలీవుడ్‌లో ఎదగాలనుకుంటే అవన్నీ చేయాల్సిందే..

బాలీవుడ్‌లో ఎదగాలనుకుంటే అవన్నీ చేయాల్సిందే..

8a 2
యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత… బాలీవుడ్‌లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయంపై ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. పైకి కనిపించేంత అందంగా బాలీవుడ్ కానీ, అక్కడి వ్యక్తుల మనసులు కానీ ఉండవనే విషయాన్ని బయటకు వెల్లడిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై హీరోయిన్‌ శ్రద్ధాదాస్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

సినిమా బ్యాక్ గ్రౌండ్ లేనివారు బాలీవుడ్ లో నిలబడటం చాలా కష్టమని చెప్పింది. మధ్య తరగతి నుంచి వచ్చే వాళ్లు ఇండస్ట్రీలో ఎదగలేరని స్పష్టం చేసింది. ఎన్నో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పింది. బాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎదగాలనుకుంటే పార్టీలకు వెళ్లాల్సి ఉంటుంది. బాంద్రా, జుహూ ప్రాంతాల్లో ఉండే ఖరీదైన క్లబ్‌లకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడున్న వారితో స్నేహంగా మెలగాలని తెలిపింది. మేల్ యాక్టర్లకు కూడా ఇవే ఇబ్బందులు ఉంటాయని చెప్పింది.

పీఆర్ మేనేజర్లకు డబ్బులు ఇవ్వడం వల్ల కూడా ఎలాంటి ఉపయోగం ఉండదని… డబ్బు తీసుకుని వారు చెప్పేది కూడా ఇదే. వారు కూడా పార్టీలకు వెళ్లమనే సూచిస్తారని తెలిపింది. దుస్తులు, షూస్, సెలూన్, స్టయిలిస్ట్, పీఆర్, కార్లు తదితర ఖర్చులను మిడిల్ క్లాస్ నుంచి వచ్చినవాళ్లు భరించలేరని చెప్పింది. వీటిని మెయింటైన్ చేయడం చాలా కష్టమవుతుందని… అసలు ఈ రంగంలోకి ఎందుకొచ్చామా? అని అనిపిస్తుందని తెలిపింది. బాలీవుడ్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని వెల్లడించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu