ఆదా శర్మకు పెళ్లి గౌను దొరికిందట.. వరుడే కావాలి.. ఈ లక్షణాలు ఉంటే చెప్పరూ..

నటి ఆదా శర్మకు కూడా పెళ్లి పై కోరిక పుట్టినట్లుంది. తనకు తగిన రాకుమారుడిని వెతికిపెట్టండి అంటూ ట్విటర్‌లో తనకు కాబోయే వాడికి ఎలాంటి లక్షణాలు ఉండాలో ఓ లిస్ట్‌ పోస్ట్‌ చేసింది. ప్రిన్సెస్‌ గౌను ధరించి ఆ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘నా పెళ్లికి కావాల్సిన పర్‌ఫెక్ట్‌ ప్రిన్సెస్‌ గౌను దొరికింది. ఇక పర్‌ఫెక్ట్‌ రాకుమారుడి కోసం ఎదురుచూస్తున్నాను. కాబట్టి ఈ లక్షణాలు ఉన్న అబ్బాయి కనిపిస్తే నాకు చెప్పండి’ అని ట్వీట్‌ చేసింది.

ఆ రాకుమారుడికి ఉండాల్సిన లక్షణాలు ఇవే..
అతను జంతు ప్రేమికుడై ఉండాలి.
మర్యాదపూర్వకంగా ఉండాలి. ట్రాఫిక్‌లో చిక్కుకున్నా కూడా చిరాకుపడకూడదు.
అతనికి పెద్ద మనసుండాలి.
తనకు సాయం చేయలేనివారిని కూడా గౌరవించాలి.
బ్యాక్‌ఫ్లిప్స్‌(వెనక్కి ఎగిరే వర్కవుట్స్‌) ఎక్కువగా చేయాలి.
ఇద్దరం కలిసే పిజ్జా తినాలి.
అతనికి హాస్యచతురత ఉంటే మంచిది. కనీసం నేను వేసే జోకులకు నవ్వాలి.. అంటూ తనకు కాబోయే వాడికి ఉండాల్సిన లక్షణాలను చెప్పుకొచ్చారు ఆదా.

CLICK HERE!! For the aha Latest Updates