HomeTelugu Big Storiesఆదిపురుష్‌: ఫస్ట్‌ సింగిల్‌ విడుదల

ఆదిపురుష్‌: ఫస్ట్‌ సింగిల్‌ విడుదల

adipurush jai shree ram lyr

స్టార్‌ హీరో ప్రభాస్ నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’‌. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌ శ్రీరాముడిగా నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అక్ష‌య తృతీయ సంద‌ర్భంగా చిత్ర బృందం అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది.

శ‌నివారం ఈ సినిమాలోని జై శ్రీరామ్ లిరిక‌ల్ మోష‌న్ పోస్ట‌ర్ వీడియోను రిలీజ్ చేసింది. జై శ్రీరామ్‌..రాజారాం అంటూ శ్రీరాముడి గొప్ప‌త‌నాన్ని చాటిచెబుతూ ఈ పాట సాగింది. తెలుగు, హిందీ భాషల్లో ఈ పాటను రిలీజ్ చేశారు. తెలుగులో ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.

‘మా బ‌ల‌మేదంటే మీపై న‌మ్మ‌క‌మే.. త‌ల‌పున నువ్వుంటే స‌క‌లం మంగ‌ళ‌మే… మ‌హిమాన్విత మంత్రం నీ నామ‌మే అంటూ’ శ్రీరాముడిని కీర్తిస్తూ సాగిన పాట ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా కృతిసనన్‌ నటించింది. సైఫ్‌ అలీఖాన్‌ లంకాధిపతి రావణాసురుడుగా కనిపించనున్నాడు.

టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి. ఇక ఈ సినిమాను దాదాపు 10 భాషల్లో రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu