మరో సారి అటువంటి పాత్రలో ‘అల్లరి’ నరేష్‌!

చాలా కాలంగా సరైన హిట్స్‌ లేక సతమతమవుతున్న ‘అల్లరి’ నరేష్‌కు.. ‘మహర్షి’ మంచి ఉత్సహాని ఇచ్చింది. సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా నటించిన ఈ చిత్రంలో నరేష్‌ ‘రవి’ అనే స్నేహితుడి పాత్రలో నటించారు. తన నటనతో ప్రేక్షకుల హృదయాలను ద్రవింపజేశారు. ఇప్పుడు ఇదే తరహా పాత్రలో నరేష్‌ మరోసారి కనిపించబోతున్నారట.
మాస్‌ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ‘డిస్కో రాజా’ చిత్రంలో నరేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నారని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. తొలుత ఈ పాత్ర కోసం సునీల్‌ను ఎంపికచేసుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పాత్ర నరేష్‌కు దక్కినట్లు తెలుస్తోంది. వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఓ సైఫై థ్రిల్లర్‌గా ఉండబోతోందని సమాచారం. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేశ్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.