HomeTelugu Big Storiesసంచలన పాత్రలో ఐశ్వర్యా రాయ్‌

సంచలన పాత్రలో ఐశ్వర్యా రాయ్‌

7 18

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ సంచలన పాత్ర చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. వేశ్య నుంచి రంగస్థల నటిగా మారి ఆ తర్వాత గాయనిగా.. ఎదిగిన బినోదిని బయోపిక్ లో నటించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్‌లో బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తుడడంతో ఆమె కూడా ఈ ప్రాజెక్ట్ లో నటించనున్నట్లు సమాచారం. 19వ దశాబ్దంలో బెంగాల్‌కు చెందిన వేశ్య బినోదిని … రంగస్థల నటిగా మారి ఆ తరువాత నాటకాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి అనంతరం గాయనిగా మారిన ఆమె ప్రస్థానం ఎంతో మందికి ఆదర్శం. ఇప్పుడీ నటి బినోదిని జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ప్రదీప్ సర్కార్ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రంలో ఐశ్వర్యా బినోదిని పాత్రలో నటించబోతోంది. ముందుగా ఈ పాత్రను దీపికా పదుకొనే చేత నటింపజేయాలని అనుకుని ఆమెను సంప్రదించాడట దర్శకుడు సర్కార్.

ముందుగా ఈ కథ విని బాగుందన్న దీపికా.. చివరకు ఇంత భారీ పాత్రలు తాను చేయబోనని తేల్చి చెప్పేసిందిట. ‘పద్మావత్’ తర్వాత దీపికా భారీ చేయోద్దనే నిర్ణయానికి వచ్చిందట. అందుకే ఈ చిత్రంలో ఆమె యాక్ట్ చేయడానికి నో చెప్పిందట. దీంతో దర్శకుడు ప్రదీప్ సర్కార్ ఇదే స్క్రిప్ట్‌తో ఐశ్వర్యను సంప్రదించగా ఆమె కథను విని చేసేందుకు ఆసక్తి చూపించినట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐశ్వర్యారాయ్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu