కృష్ణవంశీ న్యూ మూవీ ‘అన్నం’

డైరెక్టర్‌ కృష్ణవంశీ మ‌హా శివరాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా త‌న తదుపరి చిత్రానికి సంబంధించిన టైటిల్ ప్ర‌క‌టించాడు. అన్నం.. ప‌ర‌బ్ర‌హ్మ‌స్వ‌రూపం అనే టైటిల్‌తో చిత్రం రూపొంద‌నుంద‌ని తెలియ‌జేసిన కృష్ణ వంశీ టైటిల్ పోస్ట‌ర్‌ని హింసాత్మ‌కంగా డిజైన్ చేశాడు. ఈ పోస్టర్‌లో ర‌క్త‌పు మ‌ర‌క‌లు, వేట కొడ‌వ‌లి, తాళిబొట్టు ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్యక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని చెప్పిన కృష్ణ‌వంశీ త్వ‌ర‌లో ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు. ప్రస్తుతం కృష్ణ వంశీ రంగ‌మార్తాండ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇందులో ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా బ్రహ్మానందం, అనసూయ, శివాత్మిక కీలక రోల్స్ చేస్తున్నారు. మ‌రాఠీ చిత్రం నటసామ్రాట్కు రీమేక్‌గా ఈ మూవీ రూపొందుతుంది.

CLICK HERE!! For the aha Latest Updates