HomeTelugu Trendingబిగ్‌బాస్‌-4లో 'జానీ' మాస్టర్‌..

బిగ్‌బాస్‌-4లో ‘జానీ’ మాస్టర్‌..

Jani master in telugu biggతెలుగు బిగ్‌బాస్ సీజ‌న్‌-4 త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే స్టార్‌ మా ఈ షోని అధికారికంగా ప్రకటించింది. హోస్ట్‌ నాగర్జునతో ఓ ప్రోమో కూడా విడుదల చేసింది. ఈ నెల ఆఖరున ఈ షో ప్రారంభం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అభిమానులు బిగ్‌బాస్‌ షో కోసం ఎంతో ఆస్తకిగా ఎదురు చుస్తున్నారు. కాగా ఇప్పటికే బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ ఐసొలేషన్‌లో ఉన్నట్లు అని తెలుస్తోంది. అయితే వారి పేర్లు మాత్రం బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురి పేర్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా మరో రెండు పేర్లు తెరపైకి వచ్చాయి. డ్యాన్స్‌ మాస్టర్‌ జానీ, సింగ‌ర్‌ నోయ‌ల్‌ పేర్లు వినిపిస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో వీరి పేర్లు ఇప్పుడు బాగా వైరల్‌ అవుతున్నాయి. అయితే జానీ మాస్టర్‌ ఇప్ప‌టికే ‘ఢీ’ షోలో జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా “బాపు బొమ్మ‌కి పెళ్లంట” అనే ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలోనూ పాల్గొని సంద‌డి చేశారు. కాగా గ‌త సీజ‌న్‌లో కొరియోగ్రాఫ‌ర్‌ బాబా భాస్కర్ పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న డ్యాన్స్ క‌న్నా ఎక్కువ‌గా కామెడీని పండిస్తూ ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించారు. ఈసారి కూడా ఓ కొరియోగ్రాఫ‌ర్‌ను తీసుకునే ఆలోచ‌న‌లో ఉంది బిగ్‌బాస్ యూనిట్‌. అలాగే గ‌త సీజ‌న్ విన్న‌ర్‌గా నిలిచిన రాహుల్ క్లోజ్ ఫ్రెండ్, సింగ‌ర్‌ నోయ‌ల్‌ను కూడా షోలోకి తీసుకునేందుకు ప్ర‌య‌త్నాలు జరుగుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu