HomeTelugu Trendingరెండో పెళ్లి చేసుకోబోతున్న ఐశ్వర్య రజినీకాంత్‌!

రెండో పెళ్లి చేసుకోబోతున్న ఐశ్వర్య రజినీకాంత్‌!

aishwarya rajinikanth secon
సూపర్‌స్టార్‌ రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య, స్టార్ హీరో ధనుష్ 2004లో పెళ్లి చేసుకున్న సంగతి తెలసిందే. వీరికి ఇద్దరు పిల్లలు కాగా, అంత బాగుంది అనుకుంటున్న సమయంలో గతేడాది వీరు విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. 18 ఏళ్ల పాటు సజావుగా సాగిన వీరి కాపురం ముక్కలు కావడంతో అభిమానులు సైతం షాక్‌ అయ్యారు. వీళ్లిద్దరినీ కలిపి ఉంచడానికి రజినీ ఎంత ట్రై చేసినా కుదరలేదు. దీంతో చేసేదేంలేక నిర్ణయాన్ని వారికే వదిలేశారు. ఇక అప్పటి నుంచి సింగిల్‌గానే ఉంటున్న ధనుష్, ఐశ్వర్య.. తమ కెరియర్‌పై దృష్ట పెట్టారు.

ఇదిలా ఉంటే.. ఐశ్వర్య రెండో పెళ్లికి సిద్ధమైందన్న వార్తలు సోషల్‌ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వరుడు కూడా కోలీవుడ్ హీరోనే అని సోషల్ మీడియా టాక్‌. ఐశ్వర్య రజినీకాంత్‌ ఇద్దరు పిల్లలకు తల్లి. అయితే ఆమె ఈ మధ్య ఒక కోలీవుడ్ హీరోతో క్లోజ్‌గా ఉంటున్నందున రెండో పెళ్లికి సంబంధించిన రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. చెన్నైలోని ఓ రిసార్టులో ఐశ్వర్య అతనితో కనిపించనట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఐశ్వర్య.. త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకుంటుందని కూడా తమిళ ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ పుకార్లపై ఆమె ఇప్పటి వరకు స్పందించలేదు. ప్రస్తుతానికి తను రజినీకాంత్ హీరోగా ‘లాల్ సలామ్’ మూవీకి దర్శకత్వం వహిస్తోంది. ఇదిలా ఉంటే.. హీరో ధనుష్ సైతం రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు కొంతకాలం క్రితం రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత అది అవాస్తమని తేలింది. ప్రస్తుతం ధనుష్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!