‘వివేగం’ కాంబినేషన్ రిపీట్!

అజిత్ కుమార్ హీరోగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘వివేగం’. ఈ సినిమాను తెలుగులో ‘వివేకం’ పేరుతో విడుదల చేశారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే వసూళ్ల పరంగా మాత్రం సినిమా తన సత్తాను చాటుతునే ఉంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. సినిమా మొత్తం షూటింగ్ కూడా విదేశాల్లోనే చిత్రీకరించారు. ఈ చిత్ర దర్శకుడు శివ గతంలో అజిత్ తో కలిసి ‘వీరం’,’వేదాళం’ వంటి సినిమాలకు పని చేశారు. ఆ రెండు సినిమాలు హిట్ కావడంతో ‘వివేగం’పై అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే సినిమా వసూళ్లను సాధిస్తోంది.
అయితే వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు మరో సినిమా రాబోతుందని సమాచారం. అజిత్ తో మరో సినిమా చేయాలనే ఉద్దేశంతో శివ కథను సిద్ధం చేసుకొని ఆయనకు వినిపించారట. అది కూడా యాక్షన్ నేపధ్యంలో సాగే సినిమా అని తెలుస్తోంది. కథ ఆసక్తికరంగా ఉండడంతో అజిత్ కూడా అంగీకరించారని చెబుతున్నారు. వివేగం చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు సెంథిల్, అర్జున్ త్యాగరాజన్ లు ఈ సినిమాకు కూడా నిర్మాతలుగా వ్యవహరించనున్నారని సమాచారం. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో.. చూడాలి!