అఖిల్ నిర్ణయం కరెక్ట్ యేనా..?

తెలుగులో అఖిల్ చేసిన ఒక్క సినిమా అయినా.. ఏ హీరోపై రానన్ని వార్తలు అఖిల్ పై వచ్చాయి. మొదటి సినిమా ఫ్లాప్ కావడం, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే అది కాస్త క్యాన్సిల్ అవ్వడం ఇలా అటు కెరీర్ పరంగా గానీ, వ్యక్తిగతంగా గానీ అఖిల్ అంత సంతోషంగా లేనట్లు ఉన్నాడు. అయితే ఇక అఖిల్ తన సినిమాల మీద దృష్టి పెట్టాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఇదొక ఫ్యామిలీ డ్రామా సినిమాగా తెలుస్తోంది. ఈ సినిమాకు ‘రా రండోయ్ వేడుక చూద్దాం’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. అంతా బాగానే ఉంది కానీ.. ఈ సినిమాను మొదలు పెట్టడానికి అఖిల్ ఏప్రిల్ 1 డేట్ ను సెలెక్ట్ చేసుకున్నారు. అందరూ ఫూల్స్ డే గా జరుపుకునే ఆరోజు అఖిల్ సినిమాను ప్రారంభించడం అక్కినేని అభిమానులకు రుచించడం లేదు. మరి అఖిల్ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడో.. లేక మొండిగా తనకు నచ్చిందే చేస్తాడో.. చూడాలి!