అంతరిక్షంలో సాహసయాత్ర ‘ప్యాసెంజర్స్’!

మార్టేన్ టైయిడమ్ దర్శకత్వంలో క్రిష్ ప్రాట్, జెన్నీఫర్ లారెన్స్ నటించిన రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ అడ్వంచర్ థ్రిల్లర్ ‘ప్యాసెంజర్స్’ డిసెంబర్ 21న విడుదలయింది. అంతరిక్షంలో ఓ నూతన గ్రహాన్ని కనుగొంటారు శాస్త్రవేత్తలు. అందులో జనజీవనయోగమైన అంశాలున్నాయేమో తెలుసుకొనేందుకు స్పేస్ షిప్ లో క్రిష్, జెన్నీఫర్ ను పంపిస్తారు. ఆ నూతన గ్రహాన్ని చేరుకొనేవరకు వారిని నిద్రావస్థలో ఉంచుతారు. అయితే అంతరిక్ష ప్రయాణంలో అనుకోకుండా 90 ఏళ్ళు ముందుగానే వారు నిద్రలేస్తారు.
తరువాత ఒకరిపై ఒకరు మనసు పడతారు. నిజానికి వారి నిద్రావస్థకు సెట్ చేసిన టైమ్ కంటే ముందే వారు నిద్రలేవడం వల్ల ఏమి జరిగింది? వారు అనుకున్న ప్రకారం కొత్త గ్రహం చేరుకున్నారా లేదా? తరువాత ఏమయింది? అన్న ఉత్కంఠ భరితమైన అంశాలతో కథ సాగుతుంది. జనవరి 6న భారతదేశమంతటా ఈ ప్యాసెంజర్స్ çచిత్రం తెలుగు,తమిళం,హిందీ మరియు ఆంగ్ల భాషలలో ఒకేసారి విడుదల కానుంది.