మెగా బ్యానర్‌లో అక్కినేని అఖిల్‌!

అక్కినేని నట వారసుడు అఖిల్ ‘A అఖిల్’ మొదలుకుని ‘హలో, మిస్టర్ మజ్ను’ చిత్రాలు కూడా పరాజయం చెందడంతో కొంచెం డీలా పడ్డాడు. తనకు హిట్ ఇచ్చే దర్శకుడి కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే పలువురు దర్శకులు ఆయనకు కథను సిద్ధం చేయగా వారిలో ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్, భాస్కర్ కూడా ఇన్నారట. వీరిద్దరిలో ఎవరి కథ ఓకే అయినా దాని మెగా బ్యానర్ గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తుంది. మరి చూడాలి అఖిల్ ఎవరి కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో