అమల వెబ్ సిరీస్ ‘ఫస్ట్ లుక్’

అక్కినినే నాగార్జున.. అమల వివాహం తరువాత… అమల సినిమాలు దూరంగా ఉంటూ వస్తున్నది. 2012 లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఓ పాత్ర చేసింది. ఇప్పటి వరకు తిరిగి తెరపై కనిపించలేదు. తాజాగా అమల హై ప్రీస్టీస్ అనే వెబ్ సీరీస్ లో మెయిన్ లీడ్ రోల్ చేసింది. ఈ వెబ్ సీరీస్ జీ5 స్ట్రీమింగ్ లో త్వరలోనే ప్రసారం కాబోతున్నది.

యాక్టర్ కృష్ణ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు పుష్ప ఇగ్నాటిస్ దర్శకత్వం వహిస్తోంది. ఉగాది సందర్భంగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఉగాదిరోజునే అమల తన ట్విట్టర్ ఖాతాను కూడా ఓపెన్ చేసి వెబ్ సీరీస్ ను ప్రమోట్ చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates