రాజకీయాల్లోకి నాగార్జున.. గుంటూరు నుంచి పోటీ.?

అక్కినేని కుటుంబం నుంచి రాజకీయాల్లోకి ఎవరు రాలేదు. అక్కినేని నాగేస్వర రావుకు ఎన్టీఆర్ అవకాశం ఇచ్చినా.. రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సినిమా లైఫ్ హ్యాపీగా ఉందని రాజకీయాల గొడవలు తనకు అక్కర్లేదని సైలెంట్ గా ఉన్నారు.

నాగార్జున కూడా రాజకీయాలు దూరంగా ఉన్నా.. పార్టీలతో మాత్రం సఖ్యతగా ఉన్న సంగతి తెలిసిందే. అన్ని పార్టీలతో కలిసిమెలిసి ఉండే నాగార్జున ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారని తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే నాగార్జున.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ను కలిశారు. సడెన్ గా నాగార్జున జగన్‌ను కలవడం వెనుక ఆంతర్యం ఏంటి..? వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేయబోతున్నారనే వార్తలు వచ్చాయి. అసలు విషయం అదికాదని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున నాగార్జున పోటీ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయాలకు హార్ట్ పాయింట్ గా ఉన్న గుంటూరు నుంచి నాగార్జున పోటీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.