HomeTelugu Trendingఅక్షయ్ కుమార్ బెల్ బాటమ్ ప్రారంభం

అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ ప్రారంభం

Akshay Kumar starts shootin

కోవిడ్ మహమ్మారి మధ్య తగిన జాగ్రత్తలు తీసుకొని బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తన తదుపరి చిత్రం ‘బెల్ బాటమ్’ షూటింగ్‌ను లండన్‌లో ప్రారంభించారు. నటీనటులందరూ క్వారంటైన్ పూర్తిచేసుకున్న అనంతరం షూటింగ్‌లో పాల్గొన్నారు. “లైట్స్, కెమెరా, మాస్క్ ఆన్ మరియు యాక్షన్,” అంటూ అక్షయ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఓ వీడియోను పోస్టు చేశారు. కరోనా సమయంలో షూటింగ్ చేయడం కష్టమైన పని. కానీ తప్పదు కొనసాగించాలి. దానికోసం మీ ప్రేమ, అభిమానం కావాలి అన్నాడు అక్షయ్. రంజిత్ ఎం. తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ కోసం అక్షయ్ తన కుటుంబంతో కలిసి కొన్ని రోజుల క్రితమే యూకే వెళ్లారు. “బెల్ బాటమ్” లో వాణి కపూర్, హుమా ఖురేషి, లారా దత్తా కూడా నటిస్తున్నారు. ఈ కరోనా టైమ్‌లో ఒక పెద్ద బాలీవుడ్ చిత్రం సెట్‌లోకి తిరిగి రావడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది, కరోనా సమయంలో షూటింగ్ ప్రారంభించిన సినిమాల్లో ‘బెల్ బాటమ్’ మొదటిది అని లారా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!