HomeTelugu Trending'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్!

‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్!

Ala Vaikuntapuramuloo remak
‘అల వైకుంఠపురములో’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే అలరించింది. విడుదలైన ప్రతిచోటా విజయవంతంగా మంచి వసూళ్లను రాబట్టింది. బన్నీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించింది. తెలుగులో త్రివిక్రమ్ రూపొందించిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు నిర్మాత అల్లు అరవింద్ ప్రయత్నాలు చేస్తున్నారట. కరోనా సద్దుమణిగితే షూటింగ్ మొదలుపెట్టాలని భావిస్తున్నారట. హిందీలో కార్తీక్ ఆర్యన్‌, కృతి సనన్‌ జంటగా నటిస్తారని తెలుస్తోంది. హిందీ రీమేక్‌ కోసం బాలీవుడ్ నిర్మాతలు రైట్స్ అడిగినా అల్లు అరవింద్ ఆసక్తి చూపలేదట. ఫ్యూచర్‌లో తానే హిందీలో రీమేక్ చేయాలని భావించారట. అందుకే రీమేక్ హక్కులు ఎవరికీ ఇవ్వలేదని తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!