HomeTelugu Trending'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసం అలియా పాట!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం అలియా పాట!

Untitled 5
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘RRR’. టాలీవుడ్‌ హీరోలు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్‌గా నటిస్తుంది. రామ్ చరణ్ సరసన సీత పాత్రలో నటిస్తోంది. ఈ బ్యూటీ. అయితే ఈమెలో నటిగానే కాకుండా మంచి గాయనిగా కూడా పేరుతెచ్చుకుంది. అప్పుడప్పుడు తన సినిమాలలో తన స్వరాన్ని ప్రేక్షలకు వినిపిస్తూ వస్తోంది. ఆమధ్య తాను నటించిన ‘హైవే’, ‘హంప్టీ శర్మ కీ దుల్హనియా’ వంటి హిందీ చిత్రాలలో అలియా పాడిన పాటలకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి ప్రసంశలు అందుకుంది.

ఈ క్రమంలో రాజమౌళి కూడా చరణ్, అలియాలపై చిత్రీకరించే ఓ పాటను ఆమె చేతే పాడించడానికి ప్లాన్ చేస్తున్నాడట. అయితే, తెలుగు వెర్షన్ కి కాకుండా, హిందీ వెర్షన్ కి మాత్రమే ఆమె పాట పాడుతుందనీ, తెలుగు వెర్షన్ కి మరో గాయనితో పాడిస్తారని ప్రచారం జరుగుతుంది. ఇదిలావుంచితే, కాగా ఇప్పటి వరకు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం షూటింగులో అలియా పాల్గొనలేదు. నవంబర్ మొదటి వారం నుంచి జరిగే షూటింగులో ఈ ముద్దుగుమ్మ పాల్గొంటుందని తెలుస్తోంది. అందుకోసం ఆమె డేట్స్ ఇచ్చిందట. ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం ఆమె నెల రోజుల పాటు హైదరాబాదులోనే ఉండనున్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!