జనసేన ప్రచారానికి సిద్ధమౌతున్న మెగా హీరోలు

2019 న జరుగుతున్న ఎన్నికల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. గత ఎన్నికల సమయంలో పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని స్థానాల నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అటు లెఫ్ట్ పార్టీలు, బిఎస్పీతో పొత్తుపెట్టుకున్నారు.

కొణిదెల ఫ్యామిలీ నుంచి నాగబాబు నరసాపురం ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు. ప్రస్తుతం నాగబాబు నరసాపురం పార్లమెంట్ నియోజక వర్గం లో ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎవరు నాగబాబు తరపునగాని, జనసేన తరపున కానీ ప్రచారానికి రాలేదు. ఈనెల 5 నుంచి నాగబాబు తరపున ప్రచారం చేసేందుకు అల్లు అర్జున్, వరుణ్ తేజ్ లు వస్తున్నారట. ఈ ఇద్దరు నాగబాబు తరపున ప్రచారం చేయబోతున్నారని నాగబాబు సతీమణి పద్మజ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.