ఆర్మీ ఆఫీసర్ గా బన్నీ..?

ప్రస్తుతం అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో నటిస్తున్నాడు. వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత బన్నీ, వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ సినిమా కోసం ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. టైటిల్ ను బట్టి ఇదొక దేశభక్తి చిత్రమని తెలుస్తోంది. ఈ సినిమా ఆరంభంలోనే అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని సమాచారం.

భారత్-పాకిస్థాన్ ల మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలతో ఈ సినిమా మొదలవుతుందని చెబుతున్నారు. ఈ ఎంట్రీ సీన్ ఓ రేంజ్ లో ఉండాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దానికి తగిన విధంగా భారీ సెట్స్ ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమాకు ఈ సీన్ హైలైట్ గా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నారు.