మధ్య వయసు పాత్రలో అల్లు అర్జున్‌!

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్.. నాపేరు సూర్య తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. షూటింగ్ వేగంగా జరుగుతున్నది. సంక్రాంతిని టార్గెట్ చేసుకొని షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి.

అందులో ఒకటి సుకుమార్ సినిమా కాగా, రెండో సినిమా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో వచ్చే సినిమా. అల్లు అర్జున్ .. వేణు సినిమా దాదాపుగా కన్ఫర్మ్ అయ్యిందని టాక్. ఇందులో అల్లు అర్జున్ రెండు పాత్రల్లో కనిపిస్తున్నారు. ఒకటి మధ్య వయసు పాత్ర రెండోది రెగ్యులర్ పాత్ర. మిడిల్ ఏజ్డ్ పాత్ర ఇందులో కీలకంగా ఉంటుందట. ఈ ఏడాది చివర్లో సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు. దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు.