అల్లు అర్జున్‌ ‘ర్యాప్‌ సాంగ్’‌.. వైరల్‌

స్టైలీష్ స్టార్‌ అల్లు అర్జున్‌ టాలీవుడ్‌లో ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వరుస విజయాలతో తెలుగులోనే కాదు మలయాళంలో కూడా స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రతి సినిమాలో వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. గతేడాది వచ్చిన ‘అల వైకుంఠపురములో..’ సినిమాతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో బన్నీ సినీ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఓ ర్యాప్ సాంగ్‌ను కంపోజ్ చేశాడు. ప్రముఖ ర్యాపర్ రోల్ రైడా ఈ పాటను రచించి, ఆలపించాడు. కెరీయర్‌ ప్రారంభం నుండి ఇప్పటి వరకు బన్నీ చేసిన పాత్రలు, ఆయా సినిమాల్లోని డైలాగులతో ఈ పాటను రూపొందించారు. ఈ పాట బన్నీ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. తనకు మంచి బహుమతి అందించినందుకు తమన్‌కు, రోల్ రైడాకు, ఇతర బృందానికి బన్నీ సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపాడు.

‘దియా’ నీవేనా నీవేనా లిరికల్ సాంగ్ ప్రోమో

CLICK HERE!! For the aha Latest Updates