
Megastar Chiranjeevi next movie:
“MLA” పాటలో అల్లు అర్జున్ పక్కన చక్కగా కనిపించినా… “ఇద్దరమ్మాయిలతో” స్టైల్‌గా కనిచ్చినా… క్యాథరిన్ ట్రెసా కెరీర్ అంతగా వెలుగులు చూడలేదు. కానీ ఇప్పుడు ఆమెకు బంపర్ ఛాన్స్ దక్కింది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమా!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నయనతార ప్రధాన హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పుడు క్యాథరిన్ ట్రెసా కూడా రెండో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిందట. ఈ రోల్ స్క్రీన్‌మీద throughout కనిపించబోతుందట. సో, చిన్న పాత్ర కాదన్నమాట!
View this post on Instagram
క్యాథరిన్ ఎప్పుడూ గ్లామర్‌తో పాటు ఎనర్జీతో నిండిన పాటలకి పర్ఫెక్ట్. ఇక నయనతార క్లాసీ సాంగ్స్‌లో మెరిసిపోతుంది. ఈ కాంబో చూస్తే… ఈ సినిమాకి అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అవుతారన్నమాట. అనిల్ రావిపూడి ఇలా విభిన్నంగా క్యాస్ట్ చేయడంలో మాస్టర్‌గానే ఉండేాడు.
ముందుగా సంక్రాంతి కి వచ్చాం సినిమాలో ఐశ్వర్య రాజేష్‌ను తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు చిరంజీవి, నయనతార, క్యాథరిన్ ట్రెసా కలిసి స్క్రీన్ మీద కనిపించబోతుండటం… ఫ్యాన్స్‌కి పక్కా ఫెస్టివల్ ఫీలే!
ఈ కాంబినేషన్‌తో పాటలు, కథలో ఎమోషన్స్, కామెడీ అన్నీ బలంగా ఉండేలా ఉన్నాయట. ఇప్పటి వరకు క్యాథరిన్‌కి వచ్చిన బెస్ట్ ఛాన్స్ ఇదే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ సినిమా వివరాలు ఇంకా బయటకు రాలేకపోయినా… ఈ కాస్టింగ్ చుట్టూ బజ్ బాగానే ఉంది!
ALSO READ: సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న Ramayana Teaser వివరాలు