మోక్షజ్ఞతో తప్పకుండా సినిమా చేస్తానంటున్న మహేష్‌ డైరెక్టర్‌


టాలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌ జాబితాలో అనిల్ రావిపూడి ఒకడుగా కనిపిస్తాడు. ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో విజయాన్ని అందుకున్న దర్శకుడు, ప్రస్తుతం ‘ఎఫ్ 3’ సినిమాకి సంబంధించిన కథను రెడీ చేసే పనిలో బీజీగా ఉన్నాడు.

తాజాగా ఒక షోకి సంబంధించిన వేదికపై ఆయన మాట్లాడుతూ.. “నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న సమయంలో నా గదిలోని గోడకి, మోక్షజ్ఞతో కలిసి బాలకృష్ణ దిగిన ఫొటో ఉండేది. ఆ ఫొటో చూసినప్పుడల్లా మోక్షజ్ఞ హీరోగా తప్పకుండా ఒక సినిమా చేయాలనిపించేది. కుదిరితే బాలకృష్ణగారితోను సినిమా చేయాలనుండేది. ఆ ఇద్దరి కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ సినిమా చేస్తానని కూడా నా సన్నిహితులతో చెబుతుండేవాడిని” అంటూ నందమూరి ఫ్యామిలీపై అనిల్ రావిపూడి తన అభిమానాన్ని చాటుకున్నాడు. మరి తండ్రీ కొడుకులతో వేరు వేరుగా సినిమాలు చేస్తాడా? లేదంటే ఆ ఇద్దరితో మల్టీ స్టారర్ చేసే చేస్తాడా అనేది చూడాలి