రాజ‌కీయాల్లోకి అల్లు శిరీష్.. ఈ పార్టీ నుంచేనా

మెగా హీరో అల్లు శిరీష్ సినిమాల కంటే కూడా ఎప్పుడూ బ‌య‌టి విష‌యాల‌తోనే బిజీగా ఉంటాడు. కెరీర్లో ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ కోసం క‌ల‌లు కంటున్న ఈ హీరో.. అప్పుడ‌ప్పుడూ రాజ‌కీయాల గురించి కూడా మాట్లాడేస్తుంటాడు. ఇక ఇప్పుడు కూడా ఇదే చేసాడు. ప్ర‌స్తుతం ‘ఏబిసిడి’ సినిమాతో బిజీగా ఉన్న శిరీష్.. ఎందుకో తెలియ‌దు కానీ మ‌ధ్య‌లో ఉన్న‌ట్లుండి రాజ‌కీయాల‌కు చ‌ర్చ లేపాడు. చాలా కాలంగా వేచి చూస్తున్న ఓ పొలిటిక‌ల్ షోకు ఇప్పుడు వెళ్తున్న‌ట్లు ట్వీట్ చేసాడు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ షోకు సూప‌ర్ పాపులారిటీ ఉందంటున్నాడు శిరీష్. అయితే ఆ షో పేరు మాత్రం చెప్ప‌లేదు. ఇప్పుడు అభిమానులు దీని గురించే ఆలోచిస్తున్నారు. అల్లు వార‌బ్బాయి చెప్పిన ఆ షో ఏదైయి ఉంటుందా.. అందరు బుర్ర‌ల‌కు ప‌ని చెబుతున్నారు. కానీ ఎంత ఆలోచించినా చిన్న హింట్ కూడా ఇవ్వ‌కుండా వెళ్లిపోయాడు శిరీష్. కానీ దీని వెనక చిన్న ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం ఈయన నటిస్తున్న ఏబిసిడి సినిమాలో కొన్ని రాజకీయాలు కూడా ఉన్నాయి. అందులో నవసమాజ్ పార్టీ అనేది ఒకటి ఉంది. కోట శ్రీనివాసరావు కూడా ఇందులో నటిస్తున్నాడు.

ఆయన రాజకీయ నాయకుడిగా నటిస్తున్నాడు. ఇక ఈ పార్టీతోనే శిరీష్ కూడా ఉన్నాడు. బహుశా సినిమాలో పొలిటికల్ షో గురించి శిరీష్ ఈ ట్వీట్ చేసుంటాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈయ‌న మాట తీరు చూస్తుంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన‌కు ఏదైనా స‌పోర్ట్ చేస్తున్నాడా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయి. ఏదేమైనా అల్లు శిరీష్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.