HomeTelugu Big StoriesABCD నా జీవితానికి దగ్గరగా ఉంది..!

ABCD నా జీవితానికి దగ్గరగా ఉంది..!

9b

అల్లు శిరీష్‌ హీరోగా “ఏబీసీడీ” అమెరికన్‌ బార్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ అనే ఉపశీర్షికతో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రుక్సార్‌ హీరోయిన్‌ కాగా సంజీవ్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నాగబాబు, కోట శ్రీనివాసరావు, శుభలేఖ సుధాకర్‌, రాజా తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. మే 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళ సినిమాకు తెలుగు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా అల్లు శిరీష్‌ పలు విషయాలు వెల్లడించారు.

ఈ సినిమాలో డ్రామా నాకు బాగా నచ్చింది. అందుకే ఒప్పుకున్నానని అల్లు శిరీష్ అన్నారు. మాతృకతో పోలిస్తే చిత్రంలో బాగా మార్పులు చేశాం. అందులోనూ 15 సన్నివేశాలను మాత్రమే తీసుకున్నామని తెలిపారు. దర్శకుడు సంజీవ్‌ ఈచిత్రం కోసం చాలా కష్టపడ్డట్టు తెలిపారు. తన రచనా శైలి నాకు బాగా నచ్చింది అన్నారు. నాకు, భరత్‌కు మధ్య పంచ్‌లు, కామెడీ చాలా బాగుంటాయి. ఈ కథలో నన్ను నేను చూసుకున్నా. చాలా సందర్భాల్లో నా జీవితం గుర్తొచ్చింది. ముంబయిలో చదువుతున్నప్పుడు మా నాన్న నా ఖర్చులకు తగ్గట్టు డబ్బులు ఇచ్చేవారు. అమెరికాలో కూడా చాలా తక్కువ డబ్బుతో గడపాల్సి వచ్చేది. అదంతా నాకు ఈ సినిమా చేస్తున్న సమయంలో గుర్తొచ్చింది. అమెరికాలో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన ఓ కుర్రాడు చేతిలో డబ్బులు లేకుండా ఇండియాకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? అతడు ఎలా
నెట్టుకొచ్చాడనేదే ఈ సినిమా అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!