బిగ్‌బాస్-4 తెలుగు (10సెప్టెంబర్ 2020) హైలైట్స్

ఈ రోజు బిస్‌బాస్‌ దివి నోరు విప్పింది. ఇప్పటికే షో ప్రారంభమై మూడు రోజులు అయిన ఈ అమ్మడు ఇప్పటి వరకు నొరువిప్పలేదు. ఈ రోజు ఛాన్స్‌ దొరకడంతో.. అందరి గురించి మైనస్‌ పాయింట్‌లు చెప్పింది. కళ్యాణి ఓవర్‌ చేస్తుంది అని, గంగవ్వ బాగా ఏడుస్తుంది అని, లాస్య సెన్సిటీవ్‌ అని, సూర్య కిరణ్‌ డామినేషన్‌ తగ్గించు కోమంది, అమ్మ రాజశేఖర్‌ కుళ్లు జోకులు తగ్గించు కోమని చెప్పింది. మిగతా సభ్యుల గురించి చెప్పింది. ఇక కొత్తగా వచ్చిన వారి గురించి తనకు తెలియదు అని చెప్పింది. ఇక బిగ్‌బాస్‌ సోహల్‌, అరియాను రూమ్‌లోకి పిలిచి.. ఇంటి సభ్యులు ఒక్కొక్కర్ని పిలిచి తమ దృష్టిలో కట్టప్ప ఎవరో అడగమని చెప్పాడు. ఇది టాస్క్‌ ఏమో అని ఇంటి సభ్యులకు డౌట్‌ వచ్చింది. కాసేపు ఆలోచించిన తరువాత.. ఫస్ట్‌ సూర్య కిరణ్‌ తనకు కట్టప్పగా అఖిల్‌ అనిపిస్తున్నాడు చెప్పాడు. గంగవ్వ అఖిల్‌ అని, అమ్మ రాజశేఖర్‌ నోయల్‌ అని, దేవి ఎవరు లేరు అని చెప్పింది. దివి లాస్య అని, మెహాబూబ్‌ లాస్య అని చెప్పింది.

గంగవ్వ ఇంటిలో కామెడీ చేసింది అందరిపైనా పంచ్‌లు వేసింది. కళ్యాణి గురించి చెప్తూ అప్పుడే పనిచేస్తావ్‌ అప్పుడే ఏడుస్తావ్‌ అంది. అభిజిత్‌ ఎప్పుడూ యాపిల్‌ తింటూ బాగానే ఉంటావు అంది. దేవక్క వంటలు చేస్తూ అందరితో కలిసి ఉంటుంది అంది. లాస్య కొడుకుని తలుచుకుంటూ ఊరికే బొమ్మను ముద్దు పెట్టుకుంటూ ఉంటుందని.. సూర్యకిరణ్‌ పంచాయతీ దారుడు అని అందరిపైనా పంచ్‌లు వేసింది. గంగవ్వ గురించి సోహాల్‌ మాట్లాడుతూ నువ్వు మొహంమీద కొట్టినట్లు చెప్తావు అన్నాడు. మరి చెప్పనా అని కౌంటర్‌ ఇచ్చింది గంగవ్వ. తరువాత నోయల్‌ బిగ్‌బాస్‌పైన ఓ పాట పాడాడు. తర్వాత బిగ్‌బాస్ లగ్జరీ బడ్జెట్‌ కోసం సభ్యులకు 2వ టాస్క్‌ ఇచ్చాడు. టమాటాలు ఇచ్చి దానితో సాస్‌ చేసి బాటిల్స్‌లో నింపాలి.

CLICK HERE!! For the aha Latest Updates