HomeTelugu Trendingదిల్‌రాజు అల్లుడితో బేబీ వైష్ణవి మూవీ

దిల్‌రాజు అల్లుడితో బేబీ వైష్ణవి మూవీ

Baby Vaishnaviబేబి సినిమాతో అద్భుతమైన పాపులారిటీ సంపాదించిన హీరోయిన్ వైష్ణవి చైతన్య. అందం, అభినయంతో మెప్పించి అభిమానులకు దగ్గరైంది. బేబీ సినిమాలో వైష్ణవి నటనకు చాలా ప్రశంసలు దక్కాయి. వరుసగా సినిమా ఆఫర్లు కూడా వస్తూనే ఉన్నాయి.

బేబి తర్వాత వైష్ణవి ఆనంద్ దేవరకొండతో మరో సినిమా చేస్తోంది. వైష్ణవి చైతన్య మరో చిత్రానికి కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్‍రాజు అల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న సినిమాలో వైష్ణవి హీరోయిన్‍గా చేయబోతుంది.

‘రౌడీ బాయ్స్’ సినిమాతో ఆశిష్ రెడ్డి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రెండో చిత్రాన్ని కూడా దిల్‍రాజు నిర్మించనున్నారు. ఈ సినిమాకు హీరోయిన్‍గా వైష్ణవి చైతన్యను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రంతో అరుణ్ భీమవరపు దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్టు తెలుస్తోంది.

ఆశిష్ రెడ్డి, వైష్ణవి చైతన్య జంటగా ప్రేమకథా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి టైటిల్‍ను కూడా ఇప్పటికే ఖరారు చేసినట్టు సమాచారం. ‘లవ్ మీ’ అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ ప్రకటన సమయంలోనే టైటిల్‍ను కూడా రివీల్ చేసే అవకాశం ఉంది.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu