HomeTelugu Trendingకమల్‌హాసన్‌ న్యూలుక్‌

కమల్‌హాసన్‌ న్యూలుక్‌

6 5

విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘భారతీయుడు2’. ఈ చిత్రంలో కాజల్‌ హీరోయిన్‌. ఎప్పుడో కొబ్బరికాయ కొట్టిన ఈ చిత్రం మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా ఉంది. ఈ నేపథ్యంలో కమల్‌హాసన్‌ తాజా లుక్‌ చూస్తుంటే త్వరలోనే సినిమా మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉందని కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. కమల్‌ ప్రస్తుతం తమిళ బిగ్‌బాస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన క్లీన్‌ షేవ్‌తో కనిపించారు. దీంతో తాజా లుక్‌ ‘భారతీయుడు2’ కోసమేనని సినీ వర్గాలు చెబుతున్నాయి.

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కమల్‌-శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 19వ తేదీ నుంచి రాజమహేంద్రవరంలో షూటింగ్‌ చేస్తారని తెలుస్తోంది. అయితే, దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్‌తో పాటు, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సిద్ధార్థ, ప్రియా భవానీ శంకర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూర్చనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu