HomeTelugu Trendingహాయ్‌ నాన్న 'థర్డ్‌సింగిల్‌' విడుదల

హాయ్‌ నాన్న ‘థర్డ్‌సింగిల్‌’ విడుదల

third song from hi nanna

టాలీవుడ్ న్యాచురల్‌ స్టార్ నాని న‌టిస్తున్న తాజా చిత్రం ‘హాయ్‌ నాన్న’. నాని 30గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో శౌర్యువ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ సినిమాలో మృణాళ్‌ ఠాకూర్ ఈ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌కి మంచి స్పందన వచ్చింది.

తాజాగా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ థ‌ర్డ్ సింగిల్ వ‌దిలారు. ఈ సాంగ్ నాకు చాలా ప్రత్యేకమైనది. నా హస్బెండ్ కి ఈ పాట అంకితమిస్తున్న.. ఇది మా థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ. అంటూ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో సాంగ్ మొద‌ల‌వుతుంది. ‘ప్రాణం అల్లాడి పొద అమ్మాడి’ అంటూ ఈ పాట‌ సాగింది. కృష్ణకాంత్ రాసిన ఈ గీతాన్ని కాల భైరవ, శక్తిశ్రీ గోపాలన్ ఆలపించారు. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి, డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌ తెరకెక్కిస్తున్నారు.

హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించాడు. ఇక ఈ సాంగ్‌లో నాని, మృణాల్‌ల‌ పెళ్లి అయ్యినట్లు క‌నిపిస్తుంది. చూస్తుంటే ఈ జోడీ మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ వర్కవుట్ అయినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ మాత్రమే కాకుండా అందమైన ప్రేమ జంట మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా హైలైట్ కాబోతున్నాయని తెలుస్తోంది. ఈ మూవీలో నాని కూతురి పాత్రలో బేబి కైరా ఖన్నా నటిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!