ముంబైలో యాక్షన్‌కు సిద్ధమౌతున్న ‘ఫైటర్‌’


యంగ్‌ హీరో.. విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. ఈ సినిమా తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. పూరి – చార్మి కలిసి నిర్మించనున్న ఈ సినిమాకి, కరణ్ జోహర్ కూడా నిర్మాణ భాగస్వామిగా వున్నాడు.

ఈ కారణంగా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసే ఆలోచనలో వున్నారు. ముంబైలోని ‘జుహూ’ .. ‘తాజ్’ హోటల్ ప్రదేశాల్లో యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించనున్నారని సమాచారం. అక్కడి లొకేషన్స్ ను ఆల్రెడీ ఖాయం చేశారట. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీకపూర్ నటించనుందని అంటున్నారు. జనవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

 

CLICK HERE!! For the aha Latest Updates