HomeTelugu Trendingమగబిడ్డకు జన్మనించిన మహేష్‌ హీరోయిన్‌

మగబిడ్డకు జన్మనించిన మహేష్‌ హీరోయిన్‌

Amrita Rao gave birth to ba

సూపర్‌ స్టార్‌ మ‌హేష్ బాబు ‘అతిథి’ సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన ‘అమృతా రావు’ తల్లి అయింది. నిన్న (ఆదివారం) పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మనిచ్చింది. ఈ విష‌యాన్ని కుటుంబ స‌భ్యులు మీడియాకు తెలిపారు. త‌ల్లి, బిడ్డ ఇద్ద‌రు క్షేమంగా ఉన్నార‌ని వారు తెలియ‌జేశారు. అన్మోల్ దంప‌తులకు సెల‌బ్రిటీలు, అభిమానులు, సన్నిహితులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. కాగా, ఏడేళ్ళ పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్ద‌రు 2016లో పెళ్ళి పీట‌లెక్కారు. తెలుగులో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. సోషల్ మీడియా ద్వారా ఇప్పటికి అభిమానులతో టచ్ ఉంటుంది అమృతా రావు. పెళ్లి తర్వాత కూడా వెండి తెర మరియు బుల్లి తెరపై సందడి చేస్తున్న ఈ అమ్మడు ఇప్పుడు బాబుకు జన్మనివ్వడంతో కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!