HomeTelugu Big Storiesకాబోయే భర్తకు బ్రేకప్‌ చెప్పిన అమీజాక్సన్‌!

కాబోయే భర్తకు బ్రేకప్‌ చెప్పిన అమీజాక్సన్‌!

amy jackson break up with f

తెలుగు ప్రేక్షకులకు ఎవడు, అభినేత్రి, రోబో 2.0, ఐ సినిమానితో పరిచయమైన నటి అమీజాక్సన్‌. ‘2.0’ సినిమా తర్వాత వెండితెరకు దూరంగా ఉన్న ఈ నటి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అమీజాక్సన్‌ తనకు కాబోయే భర్తకు బ్రేకప్‌ చెప్పేశారని వినిక మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ తమ ప్రేమకు స్వస్తి చెప్పుకున్నారని సోషల్‌ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి.

నటిగా రాణిస్తున్న టైమ్‌లో జార్జ్‌ పనియోటౌ అనే ప్రముఖ వ్యాపారవేత్తతో అమీజాక్సన్‌కు పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారింది. కొంతకాలంపాటు సహజీవనంలో ఉన్న ఈ జంటకు బాబు కూడా జన్మించాడు. ఈ క్రమంలోనే అమీ-జార్జ్‌ గతేడాది వివాహం చేసుకుందామని భావించారు. కరోనా కారణంగా వీరి వివాహం వాయిదా పడింది. కాగా, తాజాగా అమీజాక్సన్‌.. జార్జ్‌ పనియోటౌకు సంబంధించిన అన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి తొలగించారు. దీంతో వీరిద్దరూ విడిపోయారంటూ పలువార్తాకథనాలు బయటకు వచ్చాయి. వ్యక్తిగత విషయాల్లో వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతోనే విడిపోయారంటూ రూమర్స్‌ వస్తున్నాయి. దీనిపై అమీజాక్సన్‌ స్పందించలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!