సావిత్రి సినిమాలో సూర్య..?

మహానటి సావిత్రి జీవిత చరిత్రను సినిమాగా రూపొందించడానికి దర్శకుడు నాగశ్విన్ సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో సావిత్రి పాత్రకు గానీ కీర్తి సురేశ్ ను ఎంపిక చేసుకున్నారు. అలానే మరో కీలక పాత్రలో సమంత కనిపించనుంది. దాంతో పాటు ఈ సినిమాలో ఎన్టీఆర్, నాగేశ్వరావు పాత్రల్లో ఎవరు నటిస్తారా..? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అలానే ఈ సినిమాలో మరో కీలక పాత్ర కూడా ఉందట.

అదే శివాజీ గణేషన్. ఆ పాత్ర కోసం సూర్యను సంప్రదించరాట దర్శకనిర్మాతలు. నిజానికి ఆ పాత్రలో కొంత నెగెటివిటీ ఉంటుంది. కాబట్టి ఆ పాత్రలో కనిపిస్తే తన ఇమేజ్ కు కొంత డ్యామేజ్ జరిగే అవకాశాలున్నాయని సూర్య ఆలోచిస్తున్నాడు. దాంతో ఆయన కొన్ని మార్పులు సూచించాడట. మరి ఆ మార్పులకు దర్శకుడు అంగీకరిస్తాడో.. లేక మరో ఆప్షన్ చూసుకుంటాడో.. చూడాలి!