తల్లి కాబోతున్న రజనీ హీరోయిన్‌

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్, శంకర్ ‘2 పాయింట్ 0’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన యామీ జాక్సన్ కొంతకాలం క్రితం తన ప్రేమికుడ్ని వివాహమాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఇంకో విశేషాన్ని కూడా తెలిపారు. ప్రస్తుతం తాను గర్భంతో ఉన్నానని, అక్టోబర్ నెలలో మొదటి బిడ్డ పుట్టునుందని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆమె అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ఇకపోతే పెళ్లి తరవాత యామీ జాక్సన్ కొత్త సినిమాలు వేటికీ సైన్ చేయలేదు.