ఎన్టీఆర్ సరసన హాట్ బ్యూటీ!

వరుస హిట్ మూవీలతో జూనియర్ ఎన్టీఆర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల విడుదలైన ‘జై లవకుశ’ మూవీ రికార్డ్స్ కలెక్షన్స్‌తో దూసుకుపోతుండటంతో వారంలోనే ఈ మూవీ 100 కోట్ల క్లబ్‌లో చేరి ఎన్టీఆర్ కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. అలానే బుల్లితెరపై ‘బిగ్ బాస్ రియాలిటీ షో’ 70 రోజుల పాటు అలరించాడు. ప్రస్తుతం మూడు నెలల పాటు తన ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడు. ఈ టూర్ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్ కాంబినేష‌న్‌లో ఓ భారీ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే.  

ప‌వ‌ర్‌స్టార్‌తో సినిమా పూర్తి చేశాక‌, ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు త్రివిక్ర‌మ్ ఇప్ప‌టికే స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. జ‌న‌వ‌రి నాటికి త్రివిక్ర‌మ్ పూర్తి స్క్రిప్టుతో రెడీగా ఉంటారు. ఇక సెట్స్‌కి వెళ్లిపోవ‌డ‌మేన‌ని తెలుస్తోంది. ఈ మూవీలో తారక్ మిలటరీ అధికారిగా కనిపించనున్నాడు. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా అను ఎమ్మాన్యూయల్ పేరు వినిపించింది. కానీ ఇప్పుడు  త్రివిక్ర‌మ్ క‌థానాయిక‌ను ఫైన‌ల్ చేశాడ‌ని తెలుస్తోంది. రోబో బ్యూటీ అమీ జాక్సన్  ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేయ‌నుందట‌. 
ఇప్పటివరకు తెలుగులో సరైన బ్రేక్ అందుకోలేకపోయిన అమీ జాక్సన్ కు ఈ సినిమా అయినా విజయాన్ని అందిస్తుందేమో చూడాలి!