వాల్తేరు శీనుగా రౌడీ పాత్రలో సుమంత్


అక్కినేని హీరో సుమంత్ తాజా చిత్రం ‘అనగనగా ఒక రౌడీ’. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఏక్ ధో తీన్ ప్రొడక్షన్స్ పతాకంపై గార్లపాటి రమేష్, డాక్టర్ టిఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. జబర్దస్త్ ధనరాజ్, మధునందన్, మిర్చి కిరణ్, మనోజ్ నందమ్, రఘు కారుమంచి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో
వాల్తేరు శీను పేరుతో సుమంత్ ఓ రౌడీ పాత్రను చేస్తున్నాడు. ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందుతోంది. ప్రస్తుతం షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించి తాజా పోస్టర్‌ను షేర్ చేశాడు సుమంత్. ఈచిత్రంతో మను యజ్ఞ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సంగీతం మార్క్ కె.రాబిన్.

CLICK HERE!! For the aha Latest Updates