విలన్‌గా నటించనున్న సాయి పల్లవి..

నేచురల్‌ స్టార్‌ నాని ‘టాక్సీవాలా’ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు ‘శ్యామ్ సింగ రాయ’ అనే ఆసక్తికర టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని తెలుస్తుంది. ఈ సినిమా ‘ఫిదా’ బ్యూటీ సాయిపల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి నెగిటివ్ పాత్రలో చేయనుందన్న వార్త ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఇప్పటి వరకు చేసిన పాత్రకు పూర్తి విభిన్నమైన పాత్రను సాయి పల్లవి చేయబోతుంది. నాని గెటప్ మరియు పాత్ర కూడా ఈ సినిమాలో చాలా విభిన్నంగా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే హింట్స్ ఇస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి కాకుండా మరో హీరోయిన్ కూడా ఉంటుందట. కాగా నాని నటించిన తాజా చిత్రం ‘వి’ సెప్టెంబర్ 5న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో సుదీర్ బాబు కీలక పాత్రపోషిస్తున్నాడు. నివేద థామస్ , అదితి రావ్ హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు .

CLICK HERE!! For the aha Latest Updates