HomeTelugu Trending'ఆచార్య'లో అనసూయ స్పెషల్‌ సాంగ్‌ కానీ చిరంజీవితో కాదు..

‘ఆచార్య’లో అనసూయ స్పెషల్‌ సాంగ్‌ కానీ చిరంజీవితో కాదు..

10 4
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరక్కెకుతున్న చిత్రం ‘ఆచార్య’. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. లాక్ డౌన్ తరువాత తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో చిరంజీవి .. రెజీనా కాంబినేషన్లో ఒక స్పెషల్ సాంగ్ కూడా వుంది. ఆ పాటను చిత్రీకరించడం జరిగిపోయింది.

అనసూయపై మరో స్పెషల్ సాంగ్ ఉందనే టాక్ వచ్చింది. ఒక సినిమాలో రెండు స్పెషల్ సాంగ్స్ ఎలా వుంటాయనే సందేహం ప్రేక్షకులకు వస్తుంది. అయితే ఈ సినిమాలో అనసూయపై స్పెషల్ సాంగ్ ఉన్నమాట వాస్తవమేనని అంటున్నారు. ఇందులో నక్సలైట్ గా నటిస్తున్న చరణ్ ఎపిసోడ్ లో ఆమె కనిపిస్తుందని చెబుతున్నారు. మొత్తానికి ఈ పాటలో అనసూయ దుమ్మురేపేస్తుందన్న మాట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu