అది ఐటంసాంగ్‌కాదమ్మా.. నెటిజన్‌కు అనసూయ కౌంటర్‌

యాంకర్‌ అన‌సూయ భ‌రద్వాజ్ తాజాగా ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ అనే చిత్రంలో ‘పైన ప‌టారం’ అనే సాంగ్‌తో ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అయితే ఈ పాట‌తో కొంద‌రు తన‌ను ఐట‌మ్‌గార్ల్‌ అని పిల‌వ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తోంది అన‌సూయ‌. ఐటెంసాంగ్‌లో ఎందుకు క‌నిపించారంటూ ఓ ఫాలోవ‌ర్ అన‌సూయ‌ను అడిగాడు. దీనికి త‌న‌దైన స్టైల్‌లో స‌మాధాన‌మిచ్చిందీ ఈ బ్యూటీ.

‘అది ఐటంసాంగ్‌కాదు. ఐటెంసాంగ్ అనేది ఏది లేద‌మ్మా. ఒక పాట‌కు ఉన్న కాస్ట్ కాకుండా స్పెష‌ల్‌గా ఎవ‌ర‌న్నా కావాలి అనుకున్న‌పుడు స్పెష‌ల్ సాంగ్ వ‌స్తుంది. ఒక‌ప్పుడు అమ్మాయిని వ‌స్తువులా ట్రీట్ చేసేవాళ్లు ఇచ్చిన పేరు అది. ఆ లిరిక్స్ వ‌ల్లే నేను ఈ స్పెష‌ల్ సాంగ్ చేశాన‌ని క్లారిటీ ఇచ్చింది. తాను ఐటెంగార్ల్‌ను కాద‌ని, స్పెష‌ల్ హీరోయిన్’ ను అని జ‌వాబిచ్చింది.

CLICK HERE!! For the aha Latest Updates