‘శాతకర్ణి’లో అనసూయ వాయిస్!

అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై తన అందంతో, అభినయంతో ఆకట్టుకున్న నటి అనసూయ. త్వరలోనే ఆమె ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సినిమాల షూటింగ్స్ కూడా మొదలుకానున్నాయి. అయితే అనసూయ శాతకర్ణి సినిమాకు తన గొంతు అందించినట్లు సమాచారం. ఈ అమ్మడు
డబ్బింగ్ చెప్పడంలో కూడా అనుభవం సంపాదించింది.

ఆ అనుభవంతోనే శాతకర్ణి సినిమాలో ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇండో గ్రీక్ యోధురాలిగా డచ్ మోడల్ ‘ఫరా కరిమి’ నటించారు. ఈ పాత్ర నిడివి సినిమాలో తక్కువ ఉన్నప్పటికీ.. కథను మలుపు తిప్పేంత ముఖ్యమైన పాత్ర అని తెలుస్తోంది. ఈ పాత్రకు అనసూయ వాయిస్ అయితే బావుంటుందని ఆమెను సంప్రదించగా వెంటనే ఓకే చెప్పేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా బాలయ్య వందో ప్రాజెక్ట్ లో తను కూడా భాగమైనందుకు అమ్మడు తెగ సంతోషపడిపోతోంది.