స్పెషల్ సాంగ్ లో మరోసారి మెరుపులు మెరిపించనున్న ‘అనసూయ’

ఒక వైపు టీవీ షోలకి హోస్ట్ గా వ్యవహరిస్తునే.. మరో వైపు సినిమాల్లోని నటిస్తున్న యాంకర్‌ అనసూయకి ఆఫర్లు వరసగా వస్తున్నాయి. అంతకు ముందు అడపాదడపా సినిమాల్లో కనిపించే అనసూయకి రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్‌ తరువాత ఒక్కసారిగా అదృష్టం మారిపోయింది. వరసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నది. ప్రస్తుతం యాత్ర, కథనం వంటి సినిమాలు చేస్తున్నది.

ఇదిలా ఉంటె, ఇదివరకే సాయి ధరమ్ తేజ్ సినిమాలో ‘సూయ సూయ సూయ’ అంటూ స్పెషల్ సాంగ్ లో మెరుపులు మెరిపించిన అనసూయ మరోసారి స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేయబోతున్నది. వెంకటేష్.. వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న ‘ఎఫ్‌2’ (ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌) మల్టీస్టారర్ సినిమాలో స్టెప్పులు వేయబోతున్నది. ఈ సాంగ్ కోసం స్పెషల్ గా విలేజ్ సెట్ ను వేశారట. ఫోక్ టైప్ లో సాంగ్ ఉండబోతుందని సమాచారం. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతున్నది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates