HomeTelugu Trendingహీరోగా యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు

హీరోగా యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు

13a 3

బుల్లితెర యాంకర్లు చాలామంది ఇప్పటికే వెండితెర మీద కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే అనసూయ, రష్మీ, రవి లాంటి వారు ఈ లిస్ట్‌లో చేరగా తాజా మరో స్టార్ యాంకర్‌ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అధికారిక ప్రకటన రాకపోయిన ప్రదీప్‌ మాచిరాజు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుందన్న వార్త టాలీవుడ్‌ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది.

ఈ సినిమాకు సుకుమార్‌ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన మున్నా డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. 1947 నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రదీప్ సరసన ఓ తమిళ బ్యూటీ న‌టించ‌బోతుంది. కేవ‌లం కోటిన్నరతో మొద‌లు పెట్టిన ఈ చిత్రానికి దాదాపు 3.8 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈసినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

13 7

Recent Articles English

Gallery

Recent Articles Telugu