యాంకర్‌ రవికి కారు యాక్సిడెంట్

యాంకర్‌ రవి మరోసారి వార్తల్లోకి వచ్చాడు. తాజాగా ఈయన కారుకు యాక్సిడెంట్ అయింది. తన యూ ట్యూబ్ ఛానెల్లో వీడియోను కూడా పోస్ట్ చేసాడు ఈ యాంకర్. మూసాపేట్ నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్తున్న సమయంలో రవి కారుకు ప్రమాదం జరిగింది. ఓ డిసిఎం వ్యాన్ వచ్చి తన కారును ఢీ కొట్టిందని.. ఈ ప్రమాదంలో తనకేం కాలేదు కానీ కారు మాత్రం డ్యామేజ్ అయిందని చెప్పుకొచ్చాడు. తన లైన్‌లోనే తాను ఉన్నా కూడా రాంగ్ రూట్‌లో వచ్చి.. నేరుగా కార్‌కు డ్యాష్ ఇచ్చాడని చెప్పాడు రవి. ఆ సమయంలో వెళ్లి డిసిఎం వ్యాన్ డ్రైవర్‌ను అడిగితే ఆ సమయంలో అతడు దారుణంగా తాగి ఉన్నాడని చెప్పాడు రవి.

పట్టుకోడానికి చూస్తే పారిపోయాడని.. అయితే అంత దారుణంగా తాగి ఉన్న డ్రైవర్ బండి నడిపితే రోడ్డు మీద ప్రాణాలు పోవా అంటూ ప్రశ్నిస్తున్నాడు. కారుకు యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఆయన డ్రైవర్ కార్లోనే ఉన్నాడు. పైగా తనకు పెళ్లాం పిల్లలున్నారు వదిలేయండి సర్ అంటూ తనను అడిగాడని చెప్తున్నాడు రవి. ఆ తర్వాత వాళ్లు డిసిఎం అక్కడే వదిలేసి పారిపోయారని చెప్పాడు ఈ యాంకర్. తన డ్రైవర్ ఆ డిసిఎం డ్రైవర్, క్లీనర్‌ను పట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నట్లు చెప్పాడు రవి. ఇంత దారుణంగా తాగి డ్రైవ్ చేయడం వల్లే రోడ్డు మీద ఇలాంటి భారీ ప్రమాదాలు జరుగుతున్నాయని.. అదృష్టం బాగుండి ఏం కాలేదని ఒకవేళ ఏదైనా అయితే ఏంటి పరిస్థితి అంటున్నాడు. అక్కడే ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేసాడు యాంకర్ రవి.

CLICK HERE!! For the aha Latest Updates