HomeTelugu Big Storiesభారీ సెక్స్ స్కాండల్ గుట్టు రట్టు

భారీ సెక్స్ స్కాండల్ గుట్టు రట్టు

11a 3
మధ్యప్రదేశ్‌లో భారీ సెక్స్ రాకెట్ బయటపడింది. నలుగురు మహిళలు ఆడిన ఆటలో ఎంతోమంది అమాయక యువతులే కాదు, అధికారులు, రాజకీయ నాయకులు కూడా చిక్కుకున్నారు. దేశవ్యాప్తంగా హనీ ట్రాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఆడి కార్లను, ఫ్లాట్లను ఇస్తామని కాలేజీ పిల్లలకు ఆశ చూపడం, ఉద్యోగాలు ఇప్పిస్తామని తల్లిదండ్రులకు ఎరవేయడం నేతలు, అధికారుల కోర్కెలు తీర్చేందుకు అమ్మాయిలను బలిచేయడం. భారీ సెక్స్ స్కాంలో ఇలాంటి ఎన్నో కోణాలు బయటపడ్డాయి. శృంగార దృశ్యాలను రహస్యంగా రికార్డు చేసి వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వారికి కావాల్సింది దక్కించుకోవడమే నలుగురు కిలాడీ లేడీల కుట్ర.

సెక్స్ రాకెట్‌ను అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు అడ్డంగా సంపాదిస్తున్న మాయ లేడీలు మధ్యప్రదేశ్ పోలీసులకు చిక్కారు. వీరినుంచి పోలీసులు 4 వేలకు పైగా ఉన్న వీడియో, ఆడియో క్లిప్‌లను, 92 హై క్వాలిటీ వీడియోలను, రెండు ల్యాప్‌టాప్‌లను, పలు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మాజీ సీఎం, మాజీ గవర్నర్‌కు సంబంధించిన క్లిప్‌లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 8 మంది మాజీ మంత్రుల పేర్లు కూడా ఈ స్కాంలో తెరపైకి వస్తున్నాయి. 13 మంది ఐఏఎస్ అధికారులు కూడా శృంగారం కోసం కక్కుర్తిపడి వీళ్ల వలలో చిక్కుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు సెక్స్ స్కాంలో ఉన్నారట.

11b 1

బాలీవుడ్‌కు చెందిన బి గ్రేడ్ తారలు సహా 40 మందికి పైగా కాల్‌గర్ల్స్ ఈ స్కాంలో పాత్రధారులుగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఐదుగురు మహిళల్ని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో శ్వేత విజయ్ జైన్, శ్వేత స్వప్నిల్, సోని, ఆర్పీ దయాల్, 18 ఏళ్ల కాలేజీ విద్యార్థినితో పాటు ఆర్పీ దయాళ్ డ్రైవర్ కూడా ఉన్నారు. భోపాల్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థను అడ్డంపెట్టుకుని సెక్స్ స్కాం సూత్రధారి శ్వేత ఈ బాగోతాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఇంతకాలం నడిపింది. రాజకీయ నాయకులకు, ఉన్నతాధికారులకు శారీరక వాంఛలు తీర్చేందుకు 25 మందికి పైగా కాలేజీ అమ్మాయిలకు వల వేసింది శ్వేతాజైన్. రాజకీయనాయకులు, ఉన్నతాధికారులు అమ్మాయిలతో గెస్ట్‌హౌస్‌లో ఉన్నప్పుడు రహస్యంగా స్పై కెమెరాలతో శ్వేత జైన్ గ్యాంగ్ రికార్డు చేసేవారు. బీజేపీ మాజీ సభ్యురాలైన శ్వేత 2013లో ఆపార్టీ అభ్యర్థుల ఎంపిక కమిటీలోనూ సభ్యురాలిగా పనిచేసిందని తనకున్న రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని సెక్స్ రాకెట్ నడిపించినట్లు తెలుస్తోంది.

11 17

మరో మహిళ శ్వేత స్వప్నిల్‌కు మహారాష్ట్రలో రాజకీయ నాయకులతో పరిచయాలున్నాయి. నాయకులు, అధికారులు ఢిల్లీ, ముంబై వచ్చినప్పుడు వాళ్లకు అమ్మాయిలను సరఫరా చేసేదని, ప్రతిఫలంగా భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్‌ నుంచి రూ.8 కోట్ల కాంట్రాక్టు దక్కించుకుందని చెబుతున్నారు. శ్వేత స్వప్నిల్ భర్త నుంచి 5 హార్డ్ డిస్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో వీడియో, ఆడియో క్లిప్పులు, వాట్సాప్ చాట్, స్క్రీన్ షాట్స్, మెసేజ్‌లు ఉన్నాయి. మాజీ సీఎం, మాజీ గవర్నర్, మాజీ మంత్రులు, ఐఏఎస్‌లు ఉన్నట్టు సమాచారం. ఈ స్కాంలో మరో నిందితురాలు ఆర్పి దయాళ్.. మధ్యప్రదేశ్‌లోని సీనియర్ ఐఏఎస్‌ అధికారితో సంబంధాలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. శ్వేత తరహాలోనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా లబ్ధి పొందింది. అమ్మాయిలను ఎరగా వేయడం, వీడియోలను చూపించి బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా భారీగా ప్రభుత్వ కాంట్రాక్టులు పొందినట్లు పోలీసులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలోనూ ఈ స్కాం విస్తరించింది. మాయ లేడిల వలలో చిక్కుకున్న బాధితులు ఈ రాష్ట్రాల్లోనూ ఉన్నారు. దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేకే మిశ్రా మాట్లాడుతూ.. పాల్ వేదికగా ఏళ్లుగా ఈ కుంభకోణం నడుస్తోందని, ఇందులో చిక్కుకున్న వారిలో 80 శాతం బీజేపీ నేతలు ఉన్నారని తెలిపారు. 20 శాతం కాంగ్రెస్ నేతలు ఉన్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. కాంగ్రెస్ నేతలు ఉన్నా వారిని అరెస్టు చేస్తామని ఆయన వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu